రాజధాని తరలింపుపై హైకోర్టుకు ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని తరలింపుపై హైకోర్టుకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Update: 2020-04-24 15:40 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని తరలింపుపై హైకోర్టుకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ది వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టంలో మార్పులు తెస్తూ జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన రెండు బిల్లులు అసెంబ్లీ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకొచ్చిన రెండు బిల్లులు పాస్ అయిన తర్వాతే పరిపాలన రాజధాని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఏపీ అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ హైకోర్టుకు చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే, దీనిపై అధికారికంగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీనికి పది రోజుల గడువు ఇచ్చినట్టు సమాచారం. అయితే, శాసనమండలిలో బ్రేక్ పడింది. రెండు బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపుతూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఏపీ అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను జనవరి 22న శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపింది. అయితే, కొన్ని కారణాలతో కమిటీ ఏర్పాటు కాలేదు. ఏదైనా బిల్లు శాసనమండలిలో మూడు నెలల పాటు పెండింగ్‌లో ఉంటే దాన్ని అది ఆమోదం పొందినట్టుగానే భావిస్తారు.

Tags:    

Similar News