Bapatla: బాపట్ల జిల్లాలో పడవ బోల్తా.. ముగ్గురి గల్లంతు
Bapatla: గల్లంతైన సాయివర్ణిక, తన్విష్ కుమార్, పరమేశ్వర్ (11 నెలలు)
Bapatla: బాపట్ల జిల్లాలో పడవ బోల్తా.. ముగ్గురి గల్లంతు
Bapatla: బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో ముగ్గురు గల్లంతయ్యారు. అలల ధాటికి పడవ బోల్తా కొట్టింది. గల్లంతైనవారు నాగాయలంక మండలం ఈలచెట్ల దిబ్బ వాసులుగా గుర్తించారు. భార్యాపిల్లలతో కలిసి పడవ ఎక్కిన సోంబాబు, కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత అలల ధాటికి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సోంబాబు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. పడవలో ప్రయాణిస్తున్న సోంబాబు భార్య, ఇద్దరు పిల్లలు ఆచూకీ కానరాలేదు. గల్లంతైన వారిలో సోంబాబు భార్య సాయివర్ణిక, పిల్లలు 8 ఏళ్ల తన్విష్ కుమార్, 11 నెలల పరమేశ్వర్ ఉన్నారు. పడవ ప్రమాదంపై యజమాని సోంబాబుపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.