మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

Update: 2019-02-08 13:54 GMT

పింఛన్లు 2 వేలకు పెంపు, అలాగే డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.10వేల ఆర్ధిక సాయం అందించిన ఏపీ ప్రభుత్వం శుక్రవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పినట్టయింది. వారికి 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో రాష్ట్ర ఖజానాపై రూ. 6వేల 884 కోట్ల అదనపు భారం పడనుంది. అలాగే చాలా కాలంపాటు పెండింగులో ఉన్న ఐఆర్ పై కూడా క్యాబినెట్ లో చర్చించి ఫైనల్ నిర్ణయానికి రానుంది ఏపీ ప్రభుత్వం. ఇదిలావుంటే పెన్షన్ రెట్టింపు, డ్వాక్రా సంఘాలకు ఆర్ధిక సాయం, తాజాగా ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇవ్వడంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

Similar News