ఏపీ‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీలో మద్యం షాపులను తగ్గిస్తూ ఉత్తర్వులు

Update: 2020-05-09 10:07 GMT

దశలవారీగా మద్యపాన నిషేధంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మరో 13 శాతం మద్యం షాపులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తొలగించిన 20 శాతం తో కలిపి మొత్తం 33 శాతం మద్యం దుకాణాలను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెలఖరు వరకు దుకాణాలు తీసివేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 4380 మద్యం షాపులను 2934కి తగ్గించింది. అక్టోబర్ నుండి మార్చ్ నాటికి రాష్ట్రం లో లిక్కర్ సేల్స్ 24 శాతం, బీర్ సేల్స్ 55 శాతం తగ్గినట్లు ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News