శాసనసభలో లోకేష్‌పై పరోక్ష ప్రస్తావన

Update: 2019-06-17 07:41 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వ్యక్తిగత ఆరోపణలకు వేదికయ్యాయి. నేటి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. శాసనసభలో సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు తీర్మానాన్ని బలపరచనున్నారు. శాసన మండలిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీర్మానాన్ని బలపరిచారు. కాగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో సవాళ్ల పర్వం నడిచింది. టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలు విచ్చలవిడిగా చోటుచేసుకున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల అవినీతి నిరూపించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. ఇసుక నుంచి మట్టి వరకు ప్రతి దానిలో దోపిడి జరిగిందన్నారు. ఇదిలా ఉంటే గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ప్రతిపాదనలు లేవని తోసిపుచ్చారు.

కాగా అసెంబ్లీ సమావేశాలు కొన్ని నిమిషాలు మాజీ మంత్రి నారా లోకేశ్ చూట్టుతిరిగింది. వైసీపీ మంత్రి అనిల్, లోకేష్‌పై విమర్శలు సంధించారు. శాసనసభలో లోకేష్‌పై మంత్రి అనిల్ పరోక్షంగా ప్రస్తావించారు. ఏమీ తెలియని అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు మంత్రి కాగానే టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఇరిగేషన్ పాఠాలు చెబుతుంటే చాలా బాధేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్దారు. దానికి మంత్రి సమాధానం ఇస్తూ తమకు తెలియకున్నా నేర్చుకుంటామని, మంగళగిరి పేరును సరిగా పలకలేని పప్పును కాదని లోకేష్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు ఎన్నికల్లోనే గెలవలేని వ్యక్తిని మంత్రిని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని మంత్రి అనిల్ తప్పుబట్టారు.


Tags:    

Similar News