రేపు జరగాల్సిన హై పవర్ కమిటీ భేటీ ఎల్లుండికి వాయిదా పడింది. ఈ నెల 7న హైపవర్ కమిటీ తొలి భేటీ జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడం కారణంగానే రేపటి భేటీ వాయిదా పడిందని పేర్కొంది. కాగా ఇద్దరు మంత్రులు రాష్ట్రంలో లేరని తెలుస్తోంది. శాఖా పరమైన పనుల మీద బయటికి వెళ్లినట్టు సమాచారం. అయితే వారు లేకుండా ఈ సమావేశం జరగడం కుదరదు కాబట్టే వాయిదా వేసింది ప్రభుత్వం. కాగా ఈ కమిటీ ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిమెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. బుగ్గన తోపాటు మంత్రులు..
హోంమంత్రి మేకతోటి సుచరిత, ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ, పౌర సరఫరాల శాఖమంత్రి కొడాలి నాని, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అలాగే ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, సీసీఎల్‌ఏ, చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, లా సెక్రటరీలు ఉన్నారు.