ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కేవైసీ కష్టాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ-కేవైసీ చేయించుకోకపోతే రేషన్‌ సరుకులతోపాటు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయంటూ ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Update: 2019-08-22 10:07 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ-కేవైసీ చేయించుకోకపోతే రేషన్‌ సరుకులతోపాటు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయంటూ ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పిల్లాపాపలతో రేషన్ డిపోలు, ఆధార్ కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెల్లరేషన్ కార్డుదారులను ఈ-కేవైసీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ-కేవైసీ చేయించుకోకపోతే రేషన్‌ సరుకులతోపాటు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయన్న పౌరసరఫరాలశాఖ అధికారుల హెచ్చరికలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారంతా తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని, లేదంటే సరుకులు ఇచ్చే పరిస్థితి ఉండదని తేల్చిచెప్పడంతో పిల్లాపాపలతో కలిసి అటు రేషన్ డిపోలకు ఇటు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.

ఈ-కేవైసీ చేయించుకోని జాబితాను రేషన్ డీలర్లకు అందజేసిన సివిల్ సప్లై అధికారులు వేలిముద్రలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, ఈ-పోస్ మెషీన్లు మొరాయిస్తుండటంతో ఈ-కేవైసీ ముందుకుసాగడం లేదు. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మండలంలోనూ ఈ-కేవైసీ చేయించుకోనివారి సంఖ్య వేలల్లో ఉండటంతో ఇది ఎప్పుడు పూర్తవుతుందనే ప్రశ్నార్ధకంగా మారింది. అయితే, సివిల్ సప్లై అధికారుల హెచ్చరికలతో తెల్లరేషన్ కార్డుదారులు తమ పనులు మానుకుని రోజుల తరబడి రేషన్ డిపోల ముందు పడిగాపులు పడుతున్నారు.

Full View

Tags:    

Similar News