పోలవరంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో తీసుకుంటున్న చర్యలకు ఏపీ హైకోర్టు బ్రేకులు వేసింది. పోలవరం ప్రస్తుత కాంట్రాక్టును రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు తీర్పు వెలువరించింది.

Update: 2019-08-22 06:38 GMT

ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో తీసుకుంటున్న చర్యలకు ఏపీ హైకోర్టు బ్రేకులు వేసింది. పోలవరం ప్రస్తుత కాంట్రాక్టును రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో ముందుకు వెళ్ల వద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా హైడల్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు ఈ విషయంపై కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు కాంట్రాక్ట్ రద్దుపై ప్రముఖ నిర్మాణ సంస్థ నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

తమకు ఏమాత్రం సమాచారం లేకుండా కాంట్రాక్ట్ రద్దు చేయడం వల్ల తమ సంస్ధ పరువు, ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటూ నవయుగ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకే కాంట్రాక్ట్ రద్దు చేశామని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ... ప్రస్తుత దశలో రివర్స్ టెండరింగ్‌తో పాటు హైడల్ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా స్టే విధించింది. 

Full View

Tags:    

Similar News