YS Jagan: ఏపీ ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. ఈ రోజు(సోమవారం) నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Update: 2020-04-20 03:01 GMT
YSJagan(File photo)

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. ఈ రోజు(సోమవారం) నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెడ్ జోన్లు ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఆంక్షలను సడలించింది.

కేంద్ర హోంశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో మండలాలను రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా విభజించిన ప్రభుత్వం.. రెడ్ జోన్ 97 మండలాలలో మాత్రం ప్రభుత్వం మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది. అక్కడ ఎటువంటి పారిశ్రామిక కార్యకలాపాలను అనుమతించరు. గ్రీన్ జోన్లలో పలు నిబంధనలు పాటిస్తూ సంస్థలు కార్యకలాపాలు సాగించాల్సి ఉంటుంది. దీంతో వలస కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు ఊరట కలగనుంది. అటు.. ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర కంపెనీలు కార్యకలాపాలు కొనసాగించేలా అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News