ఏపీలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామ,వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామ,వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభ కాలంలో వాలంటీర్ల ప్రతిఇంటికీ తిరిగి సేవల్ని అందించడంలో వారిది కీలకం పాత్ర అని భావించిన ఏపీ ప్రభుత్వం, ఖాళీగా ఉన్న గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల సంఖ్యలో గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల్ని భర్తీ చేసింది. కానీ వాలంటీర్లు గైర్హాజరు కావడం, కొందరు విధులు నిర్వహించకపోవడంతో, మరికొందరు ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. దాంతో 10,700 వాలంటీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అభ్యర్థులు https://gswsvolunteer.apcfss.in/ అనే వెబ్‌సైట్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 24 ఏప్రిల్ 2020. మొత్తం ఖాళీలు- 10,700, గ్రామ వాలంటీర్- 5,200, వార్డు వాలంటీర్- 5,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది.దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 24, దరఖాస్తుల పరిశీలన 2020 ఏప్రిల్ 25, ఇంటర్వ్యూ- 2020 ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 29 ఎంపికైన వారికి సమాచారం- 2020 ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 29, విధుల్లో చేరాల్సిన తేదీ మే 1 2020