కరోనా కొత్త స్ట్రెయిన్‌పై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

* ఆర్టీపీసీఆర్ టెస్టులకు సిద్ధం చేయాలన్న వైద్యారోగ్య శాఖ * కలెక్టర్లు ఎయిర్‌పోర్టు అథారిటీలతో కోఆర్డినేట్ చేసుకోవాలి- వైద్యశాఖ * యూకే నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ తప్పనిసరి- వైద్యశాఖ * టెస్టుల ఫలితాలు వచ్చే వరకు క్వారంటైన్‌లో ఉండాలని సూచన * నెగెటివ్ వచ్చినా 14రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలి- వైద్యశాఖ

Update: 2020-12-23 05:39 GMT

కరోనా కొత్త స్ట్రెయిన్‌పై ఏపీ సర్కార్‌ అప్రమత్తమైంది. యూకే నుంచి వచ్చిన వారికి టెస్టులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది వైద్యారోగ్య శాఖ. తగినన్ని టెస్టు కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్లు ఎయిర్ పోర్ట్ అథారిటీలతో కో ఆర్డినేట్ చేసుకోవాలన్నారు. నెల్లూరు, అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇక యూకే నుంచి వచ్చిన వారంతా ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫలితాలు వచ్చే వరకు క్వారంటైన్‌లో ఉండాలంది వైద్యారోగ్య శాఖ. ఒకవేళ నెగెటివ్ వచ్చినా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. 14 రోజుల పాటు ప్రతీరోజూ సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారిని పర్యవేక్షించాలని వైద్యాధికారులకు ఆదేశాలిచ్చారు. గర్భిణీలు, వృద్ధులు, పదేళ్ల లోపు చిన్నారులను గుర్తించి హోం క్వారంటైన్ కు పంపాలన్నారు. ఇక ఇంటర్నేషనల్ ప్రయాణీకులు ప్రయాణానికి 72 గంటల ముందు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

Tags:    

Similar News