దేశంలోనే ఏపీకి రెండో స్థానం.. ఒక్కరోజులోనే పెరిగిన సామర్ధ్యం
కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది.
కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఈ రోజురోజుకూ వైరస్ నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంచుకుంటోంది. కరోనా పరీక్షల్లో గణనీయంగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది. ఇటీవలే కరోనా పరీక్షల్లో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా రిపోర్ట్ లో 2వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మందిలో 715 మందికి కరోనా వైరస్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో నిలిచింది.
రాజస్తాన్ ప్రతి 10 లక్షల మందిలో 830 మందికి టెస్టులు చేస్తూ తొలి స్థానంలో కొనసాగుతోంది. కాగా.. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో దేశవ్యాప్తంగా సగటు 10 లక్షల మందికి 290 మాత్రమే ఉండటం గమనార్హం. అత్యధిక కరోనా కేసులున్న మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాష్ట్రాలకంటే ఏపీలో అధిక పరీక్షలు జరగుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 5,022 మందికి కరోనా పరీక్షలు చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల సరఫరా పూర్తయినందున పరీక్షల సామర్థ్యం మరింత పెరగనుంది. ప్రతి జిల్లాలోని మండల కేంద్రంలో ర్యాండమ్ పరీక్షలు చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఒక్క రోజులోనే 615 నుంచి 715 కి కరోనా నిర్ధారణ పరీక్షల్లో పెరుగుదల నమోదైంది