ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా టెస్ట్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తుంది. ఎవరి నుంచి ఎవరికీ కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి.

Update: 2020-04-24 13:16 GMT

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తుంది. ఎవరి నుంచి ఎవరికీ కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి.ఏపీలో ఇప్పటవరకూ 955 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా భయంతో నేతలు కోవిడ్ 19 టెస్టులు చేయించుకునేందుకు ముందుకొస్తున్నారు.

అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వం ఏపీలో వివిధ జిల్లాలకు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను పంపించింది. విజయనగరం జిల్లాకు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు చేరుకున్నాయి. 1680 కిట్లు ఈ జిల్లాకు పంపించింది.

ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు డిప్యూటీ సీఎంపుష్ప శ్రీవాణికి నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమెకు నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. శ్రీకాకుళంలోనూ కరోనా కేసులు నమోదు కాకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కలిగిస్తుంది.

Tags:    

Similar News