YS Jagan: వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పథకం.. మహిళలకు సీఎం లేఖలు

స్వయం సహాయక సంఘాల మహిళల కోసం వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Update: 2020-04-24 06:08 GMT
YSJagan (File photo)

స్వయం సహాయక సంఘాల మహిళల కోసం వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా.. ఒకే విడతన డబ్బులు జమఅవుతాయని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు. 91 లక్షల మహిళలు సభ్యులుగా ఉండే పొదుపు సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు జమ అవుతాయి. పొదుపు సంఘానికి ఎంత జమ చేసిందన్న వివరాలను సీఎం మహిళలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

సమస్య ఉంటే వస్తే ఫిర్యాదు చేసేందుకు సెర్ప్, మెప్మా అధికారుల ఫోన్‌ నంబర్లు లేఖతో పాటే అందజేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పొదుపు సంఘాలకు పావలా వడ్డీ పథకం ప్రారంభమైంది. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సున్నా వడ్డీ పథకంగా మారింది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2016ఏడాది నుంచి నిధులివ్వక పోవడంతో ఈ పథకం నిగిపోయింది.

ఈ సందర్భంగా లేఖలో సీఎం

గతంలో స్వయం సహాయక సంఘాలు ఎందుకు దెబ్బతిన్నాయో మనందరికీ తెలుసు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు బాధలను నా పాదయాత్రలో చూశాను. మన రాష్ట్రంలో 13 జిల్లాలకు మధ్య వడ్డీలో తేడాలు ఉండడం, అవి భారం కావడం కూడా నా కళ్లారా చూశాను. పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంకులు రుణాలు 6 జిల్లాల్లో 7 శాతం వడ్డీ. మిగిలిన 7 జిల్లాల్లో 11 నుంచి 13 శాతం వడ్డీకి ఇస్తున్నాయి. ఈ వడ్డీ భారం పేద అక్క చెల్లెమ్మల మీద భారం పడకూడదని ప్రభుత్వమే ఆ వడ్డీ భారం భరిస్తూ అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే ఇక రుణాలు అందిస్తుంది. 'వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పథకం' పేరుతో అమలు చేయబోతోంది.అని సీఎం జగన్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News