UPTET 2020 పరీక్ష ఫలితాలు విడుదల

UPTET 2020 పరీక్ష ఫలితాలు విడుదల
x
Highlights

UPTET 2020 ఫలితాలను ఈ రోజున ఉత్తర ప్రదేశ్ పరీక్షల రెగ్యులేటరీ అథారిటీ ప్రకటించింది.

UPTET 2020 ఫలితాలను ఈ రోజున ఉత్తర ప్రదేశ్ పరీక్షల రెగ్యులేటరీ అథారిటీ ప్రకటించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ upbasiceduboard.gov.in నందు భద్రపరిచారు. ఈ పరీక్షలో 40 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని రెగ్యులేటరీ పరీక్షల అథారిటీ పేర్కొంది. అభ్యర్ధులు పరీక్ష ఫలితాలను UPTET అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చును. 2019లో నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 354703 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని పరీక్ష రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి అనిల్ భూషణ్ చతుర్వేది స్పష్టం చేసారు.

ఇకపోతే 2019 జనవరి 8వ తేదిన ఈ పరీక్షను రెండుపేర్లుగా నిర్వహించారు. ఈ పరీక్షకు 15 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్ 1 కోసం సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు, పేపర్ 2 కోసం 5 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. కాగా ఈ హాజరైన మొత్తం అభ్యర్థులలో, 29.74% మంది మాత్రమే యుపిటిఇటి పేపర్ 1 లో ఉత్తీర్ణులయ్యారని, పేపర్ 2 లో 11.46% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని ఆయన స్పష్టం చేసారు.

ఇక పోతే ఈ పరీక్షల ఫలితాలను పరిశీలించుకోవాలనుకున్న అభ్యర్థులు ఈ విధంగా చూసుకోవచ్చు.

దశ I: updeled.gov.in వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వండి

దశ II: 'యుపి టెట్' అని స్ర్కీన్ పై కనిపించినప్పుడు దానిపై క్లిక్ చేయండి

దశ III: "UPTET ఫలితం" పై క్లిక్ చేయండి

దశ IV: అవసరమైన వివరాలను నమోదు చేయండి

దశ V: తరువాత మీ ఫలితాల లిస్టును డౌన్‌లోడ్ చేసుకోండి.

దశ VI: ప్రింట్ అవుట్ తీసుకోండి

మీ రిజల్ట్ ని చూసిన తరువాత ఆ కాపీని ప్రింట్ అవుట్ తీసుకుని ఫిబ్రవరి 29, 2020 లోపు విడుదలయ్యే యుపిటిఇటి సర్టిఫికేట్ వేరిఫికేషన్ లో చూపించాలి. ఈ సర్టిఫికెట్ 7 సంవత్సరాల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.

UPTET 2020 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...



Show Full Article
Print Article
More On
Next Story
More Stories