Top
logo

జేఈఈ మెయిన్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

జేఈఈ మెయిన్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
X
Highlights

జేఈఈ మెయిన్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా నూరుశాతం మార్కులు సాధించిన...

జేఈఈ మెయిన్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా నూరుశాతం మార్కులు సాధించిన మార్కులు సాధించిన 9 మందిలో 4 గురు విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే.

జేఈఈ మెయిన్ 2020 జనవరి సెషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం (జనవరి 17) విడుదల చేసింది.

100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల్లో ఏపీకి చెందిన ఎల్.జితేంద్ర, టి.విష్ణు శ్రీ సాయిశంకర్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక తెలంగాణకు చెందిన ఆర్.అరుణ్ సిద్దార్థ, సీహెచ్.కౌశల్ కుమార్ రెడ్డి 8, 9 స్థానాల్లో నిలిచారు.

వీరితోపాటు ఢిల్లీకి చెందిన నిషాంత్ అగర్వాల్; గుజరాత్‌కు చెందిన నిసర్గ్ చంద్ర, హరియాణాకు చెందిన దివ్యాంశు అగర్వాల్; రాజస్థాన్‌కు చెందిన అఖిల్ జైన్, పార్థీ ద్వివేది 100 పర్సంటైల్ సాధించిన వారిలో ఉన్నారు.

వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థులు వీరే!


రాష్ట్రాల వారీగా టాపర్స్ వీరే!Web TitleTelugu states students get top results in JEE Main exams
Next Story