మిలిటరీ కాలేజీలో అడ్మిషన్లు... చివరి తేదీ ఎప్పుడంటే..

మిలిటరీ కాలేజీలో అడ్మిషన్లు... చివరి తేదీ ఎప్పుడంటే..
x
Highlights

మిలిటరీ కాలేజి, స్కూల్ లో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులకు శుభవార్త.

మిలిటరీ కాలేజి, స్కూల్ లో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఉత్తరాఖండ్‌లో ఉన్న రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్-RIMC లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు గడువు పెరిగింది. నిజానికి ఈ అడ్మిషన్ చివరి తేది మార్చి 31 కాగా కరోనా సంక్షోభం కారణంగా గడువు పెంచడంతో పాటు తేదీని కూడా రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ప్రకటించింది. ఇక పరీక్ష తేదీలను మాత్రం ప్రకటించాల్సి ఉంది. మిలిటరీ అడ్మిషన్ పొందాలనుకునే వారు జూన్ 15 వ తేది వరకు అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు.

ఇక కేంద్ర ప్రభుత్వం ఆర్ఐఎంసీలో అడ్మిషన్లకు భారీగా ఫీజు సబ్సిడీ ఇస్తుంది. అడ్మిషన్ సమయంలో విద్యార్థులు సెక్యూరిటీ డిపాజిట్ రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత రూ.20,000 రీఫండ్ ఇస్తారు. అంతే కాదు మెరిట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 నుంచి రూ.20,000 స్కాలర్‌షిప్ కూడా అందనుంది. ప్రస్తుతం ఏడాదికి రూ.42,000 చెల్లిస్తే చాలు. భవిష్యత్తులో ఫీజు పెరిగే అవకాశముంది.

ఇక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌ అడ్మిషన్ వివరాలు చూసుకుంటే.....

* ఆర్ఐఎంసీలో 8వ తరగతిలో అడ్మిషన్లకు 7వ తరగతి చదువుతున్న, పాసైన అబ్బాయిలు అర్హులు.

* వయో పరిమితి :11.5 ఏళ్ల నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి.

* దరఖాస్తు ఫామ్‌ను రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ నుంచి నేరుగా పొందాల్సి ఉంటుంది.

* http://www.rimc.gov.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి ప్రాస్పెక్టస్ పొందొచ్చు.

దరఖాస్తు ఫీజు డీడీ తీసి పంపాలి.

* ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

* పరీక్ష సెంటర్ : తెలంగాణ విద్యార్థులకు హైదరాబాద్

* ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు విజయవాడలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories