JEE & NEET 2020 Test Updates: జేఈఈ, నీట్‌ గ్రాండ్‌ టెస్టుల మోడల్‌ పేపర్స్ కావాలంటే .. ఈ నెంబర్‌కు వాట్సాప్‌ చేయండి..!

JEE & NEET 2020 Test Updates: జేఈఈ, నీట్‌ గ్రాండ్‌ టెస్టుల మోడల్‌ పేపర్స్ కావాలంటే .. ఈ నెంబర్‌కు వాట్సాప్‌ చేయండి..!
x
Highlights

JEE & NEET 2020 Test Updates: జేఈఈ, నీట్‌ పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులకు శుభవార్త. అభ్యర్థులకు జేఈఈ/నీట్‌ ఫోరమ్‌ అద్భుతమైన అవకాశం కల్పించింది

JEE & NEET 2020 Test Updates: జేఈఈ, నీట్‌ పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులకు శుభవార్త. అభ్యర్థులకు జేఈఈ/నీట్‌ ఫోరమ్‌ అద్భుతమైన అవకాశం కల్పించింది. ఈ ప్రవేశ పరీక్షలకు సిద్దమయిన అభ్యర్థులకు ప్రిపరేషన్ కు ఇబ్బంది కలగకుండా వాట్సాప్ ద్వారా గ్రాండ్‌ టెస్టుల మోడల్‌ పేపర్స్‌ పంపించనుందని ఫోరమ్‌ కన్వీనర్‌ కె.లలిత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అంతే కాక ఒక్కో పరీక్షకు 10 గ్రాండ్‌ టెస్టులున్నాయని, ఆసక్తి ఉన్నవారికి వాటిని వాట్సాప్‌ ద్వారా అందజేస్తామని పేర్కొన్నారు.

జేఈఈ/నీట్‌ ఫోరమ్‌, ఐఐటీ, నీట్‌ శిక్షణా సంస్థలు సంయుక్తంగా రూపొందించిన జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌, ఎంసెట్‌ గ్రాండ్‌ టెస్టులు, కీ, సమాధానాలతో వెయ్యి గ్రాండ్‌ టెస్టులను సిద్ధం చేశామని తెలిపారు. జేఈఈ, నీట్‌ తాత్కాలికంగా వాయిదా పడటంతో ఈ అవకాశాన్ని విద్యార్థులు వీలయినంత ఎక్కువ వినియోగించకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. జేఈఈ పరీక్షలకైతే ఐఐటీ అని, ఇతర పరీక్షలకు ఆ పరీక్ష పేరు టైపు చేసి 98490 16661కు నెంబరుకు వాట్సాప్‌ మెసేజ్‌ పంపించాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories