CBSE board exams : 10 వ, 12 వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

CBSE board exams : 10 వ, 12 వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
x
Highlights

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2020లో నిర్వహించనున్న

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2020లో నిర్వహించనున్న 10 వ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను సెంట్రల్ బోర్డు అధికారిక పోర్టల్‌ డిసెంబర్ 17, 2019 న విడుదల చేసారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు 2020 ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయని ఆ పోర్టల్ లో తెలిపారు.

ఈ పోర్టల్షె లో పేర్కొన్న ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి పదోతరగతి, 12వ తరగతి ఒకేషనల్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 26 నుంచి పదోతరగతి ప్రధాన పరీక్షలు, ఫిబ్రవరి 22 నుంచి 12వ తరగతి ప్రధాన పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

ఈ పరీక్షల ఫలితాలను మే మొదటి వారంలో వెల్లడిస్తారు. పూర్తి వివరాల కోసం విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసిన పరీక్షల షెడ్యూల్ ను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చును. సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఈ ఏడాది 32 లక్షల డిజిటల్ లాకర్లను అందుబాటులో ఉంచనున్నారు. ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు తమ మార్కు షీట్లను, మైగ్రేషన్ సర్టిఫికేట్లు, పాస్ సర్టిఫికేట్లను డిజిటల్ లాకర్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

10 వ తరగతి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

12 వ తరగతి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వార్తను ఇంగ్లీష్ లో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories