YS Sharmila: దిగ్విజయంగా షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర.. 3 వేల కిలో మీటర్లు దాటిన పాదయాత్ర

YS Sharmila: 199 రోజులుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ తనయ

Rama Rao
Published on: 4 Nov 2022 1:58 PM IST
YSRTP Chief YS Sharmila Has Been on Padayatra for 199 days
X

దిగ్విజయంగా షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర.. 3 వేల కిలో మీటర్లు దాటిన పాదయాత్ర

YS Sharmila: వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు ప్రారంభించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర దిగ్విజయంగా 3 వేల కిలో మీటర్లు పూర్తి చేసుకంది. యాత్ర ప్రారంభించిన 199 రోజుల్లో సుమారు 3 వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేసుకున్నారు షర్మిల. రాష్ట్రంలోని 54 నియోజకవర్గాల పరిధిలోని 176 మండలాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తన పాదయాత్రలో ప్రజలతో మమేకమయ్యారు. ప్రజాసమస్యలను ఏకరువు పెడుతున్న ప్రజలతో ఓపికగా మాట్లాడుతూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని 50 మున్సిపాలిటీలు 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పాదయాత్ర పూర్తయింది. 1575 గ్రామాల్లో ప్రజలను కలిశారు.

Rama Rao

Rama Rao

Next Story