YS Sharmila: ఈనెల 8న కామారెడ్డికి చేరుకోనున్న షర్మిల పాదయాత్ర

YS Sharmila: కామారెడ్డి రైల్వే స్టేషన్ చౌరస్తాలో బహిరంగ సభకు ఏర్పాట్లు

Jyothi
Published on: 6 Oct 2022 1:28 PM IST
YS Sharmila Padayatra to Reach Kamareddy on 8th of this Month
X

YS Sharmila: ఈనెల 8న కామారెడ్డికి చేరుకోనున్న షర్మిల పాదయాత్ర

YS Sharmila: వైఎస్ ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల పాదయాత్ర ఈనెల 8న కామారెడ్డి పట్టణానికి చేరుకుంటుందని ఆ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి నీలం రమేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని పార్టీ కార్యాలయంలో పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ ఆర్టీపీ అధినేత షర్మిల చేపట్టిన పాదయాత్ర 2,400 కిలోమీటర్లు పూర్తి చేసుకుని, కామారెడ్డి జిల్లాతో 2,500 కిలోమీటర్లకు చేరుకుంటుందన్నారు. దివంగత నేత ప్రజలు రాజన్న కూతురును ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ను అభిమానించే ప్రతి వ్యక్తి ఈనెల 8న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ చౌరస్తాలో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Jyothi

Jyothi

Next Story