ఏడు నెలల చిన్నారితో బైక్ పై యువ జంట సాహసం

ఏడు నెలల చిన్నారితో బైక్ పై యువ జంట సాహసం
x
Highlights

సొంత గ్రామానికి చేరుకుని, తమ వాళ్లతో సంతోషంగా ఉండాలనే కాంక్ష ఉంటే చాలు ఎంత సాహసమైనా చేయొచ్చు అని ఈ జంట నిరూపించారు.

సొంత గ్రామానికి చేరుకుని, తమ వాళ్లతో సంతోషంగా ఉండాలనే కాంక్ష ఉంటే చాలు ఎంత సాహసమైనా చేయొచ్చు అని ఈ జంట నిరూపించారు. దూరాన్ని, వాతావరణాన్ని లెక్క చేయకుండా 7నెలల చిన్నారిని తీసుకుని ద్విచక్ర వాహనంపై మైళ్ల దూరం ప్రయాణించారు. చిట్టచివరికి తమ సొంత గ్రామానికి చేరుకున్నారు. పూర్తివివరాల్లోకెళ్తే గద్వాల జిల్లాలోని కొత్తపల్లితండాకు తండాకు చెందిన విశాల్, లీలాబాయి బతుకుదెరువు కోసం పూణెకి వెళ్లారు. అక్కడ టైల్స్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఏడు నెలల చిన్నారి కూడా ఉంది. కాగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ నిర్వహించడంతో వారు అక్కడే చిక్కుకుపోయాయి. ఇంటికి రావాలని, తల్లిదండ్రులను చూడాలన్న తపనతో పలుమార్లు ప్రయత్నించారు. అయిన ఫలించక పోవడంతో వారు ద్విచక్రవాహనంపై బయలుదేరాలని నిశ్చయించుకున్నారు.

మంగళవారం రాత్రి 10గంటలకు బైక్ పై పూణెలోని ఉథార్‌ నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 10 గంటలకు తండాకు చేరుకున్నారు. సరిగ్గా 12గంటలలోనే చిన్నారితో 670 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యస్థానం చేరుకున్నారు. ఎవరు చెప్పినా వినకుండా ధైర్యంచేసి ద్విచక్రవాహనంపై బయలుదేరాం అని చిన్నారికి ఆకలి తీర్చడానికి 4 చోట్ల ఆగి పాలు తాగించామని తెలిపారు. ఊరికి రావాలన్న తపనతో ఎంత దూరం వచ్చామో తెలియలేదన్నారు. సొంత గ్రామంలో వచ్చాక అందరినీ చూసాక బాధదూరమైందని, బైక్‌పై ఇంత దూరం రావటం నిజంగా సాహసమే అనిపిస్తోందని తెలిపారు. వారిని వైద్యులు అధికారులు పరీక్షించి ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని మండల అధికారులు సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories