తుది దశకు చేరుకున్న యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు

తుది దశకు చేరుకున్న యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని 750 కోట్ల వ్యయంతో తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ఆలయ పున:నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని 750 కోట్ల వ్యయంతో తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ఆలయ పున:నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆలయ పున:నిర్మాణ పనులు ఎట్టకేలకు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఆలయ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూసిన భక్తులకు శుభవార్త తెలిపినట్టయింది.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆలయం పనులు అన్ని పూర్తయ్యాని, అక్కడక్కడా చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలివున్నాయని తెలిపారు. ఈ పనులు పూర్తి కాగానే ఆలయాన్ని మంచి ముహూర్తంలో ప్రారంభించి అన్ని కైకర్యాలను నిర్వహిస్తూ సాంప్రదాయ బద్దంగా లక్ష్మీనరసింహస్వామి విగ్రహ మూర్తులను ప్రతిష్టించబోతున్నారని తెలిపారు. ఈ ఆలయాన్ని ఏడు గోపురాలతో నిర్మించారని, దీని నిర్మాణంలో ఎలాంటి లోటు జరగకుండా ప్రభుత్వం నిధులను సమయానికి కేటాయించిందని అన్నారు.

దేశంలో ఉన్న అత్యద్భుత ఆలయాల్లో యాదాద్రి ఒకటిగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేసారన్నారు. అందుకోసమే వేర్వేరు రాష్ట్రాల నుంచీ శిల్పులను పిలిపించి, ప్రత్యేక నల్లరాతిని తెప్పించి ఆలయాన్ని నిర్మించారని, దీంతో ఆలయం ఎంతో సుందరంగా కనిపిస్తుందని స్పష్టం చేసారు. ఇంత అద్భుతంగా ఆలయ నిర్మాణం జరిగడానికి కేసీఆర్ ఎంతగానో శ్రమించారని ప్రశంసించారు.

అంతే కాక యాదాద్రి చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న విధంగా పార్కులు, సందర్శన ప్రదేశాలను ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా పచ్చదనంతో, ప్రకృతి నడుమ పూల మొక్కలతో అద్భుతంగా ఉంది. అంతే కాకుండా రోగుల సౌకర్యార్ధం యాదాద్రిలో 100 పడకల ఆస్పత్రి కూడా త్వరలో నిర్మించబోతున్నారని, ఇది ఎంతో సంతోషకరమైన వార్త అని అర్చకులు తెలిపారు.

తెలంగాణలో కేసీఆర్ ముఖ్య మంత్రి అయిన తరువాతే ఆలయాల అభివృద్ధి జరుగుతుందన్నారు. అందులో భాగంగానే యాదాద్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయించి, అమల్లోకి తెచ్చారని సెలవిచ్చారు. ఇక పోతే ఆలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సతీ సమేతంగా రానుండటం అందరికీ తెలిసిన విషయమే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories