డెలివరీ కాలేదు...రాత్రికి రాత్రే కడుపులో బిడ్డ మాయం...

డెలివరీ కాలేదు...రాత్రికి రాత్రే కడుపులో బిడ్డ మాయం...
x
Woman Strange Behaviour
Highlights

సాధారణంగా ఆస్పత్రిలో బిడ్డ పుట్టాక కనిపించకుండా పోవడం, డబ్బుల కోసం ఎవరైనా ఎత్తుకెళ్లడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్న ఘటనలు.

సాధారణంగా ఆస్పత్రిలో బిడ్డ పుట్టాక కనిపించకుండా పోవడం, డబ్బుల కోసం ఎవరైనా ఎత్తుకెళ్లడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్న ఘటనలు. కానీ ఓ నిండు గర్భిణీ కడుపులో ఉన్న బిడ్డ రాత్రికి రాత్రే మాయం అయింది. ప్రస్తుతం ఈ విషయం జోగులాంబ గద్వాల జిల్లాలోని మనోపాడు మండలంలో కలకలం సృష్టిస్తోంది. పూర్తివివరాల్లోకివెళితే..పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన మంజుల(25)కు ఆరేండ్ల కిందట చిన్నపోతుపాడుకు చెందిన వెంకటేశ్‌తో వివాహం జరిగింది.

గతేడాది మానస తల్లి కానున్నట్టు వైద్యులు నిర్దారించారు. నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పటి నుంచి స్థానిక ఆశావర్కర్‌ సాయంతో మనోపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె నెలసరి పరీక్షలు చేయించుకుంటోంది. ప్రస్తుతం ఆమెకు 9 నెలలు నిండాయి. శనివారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మనోపాడు ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. పురిటి నొప్పులతో వచ్చిన మంజుల తనకు వైద్యం అవసరం లేదని, ఇంటికి వెళతానని పట్టుబట్టడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన అనంతరం ఆమె ప్రశాంతంగా నిద్రపోయింది.

ఆదివారం ఉదయం లేచేసరికి ఎలాంటి గర్భం లేదని, దీంతో తిరిగి ఆస్పతికి వచ్చానని తెలిపింది. ఈ విషయం పై వైద్యురాలిని వివరణ కోరగా మంజుల గత ఏడు నెలల కిందట కడుపుతో ఉన్నప్పుడు తానే పరీక్షించినట్టు డాక్టర్‌ చెప్పారు. ఆమెను పరీక్షించిన వైద్యులు నెల క్రితమే అబార్షన్‌ అయినట్లు నిర్ధారించారు. ఆ మహిళ తన గర్భంలో బిడ్డ ఉందని చెప్పడం, దేవుడు తీసుకెళ్లాడు అని చెప్పడం అవాస్తవమని అన్నారు. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని వెంటనే ఆమెను మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లి వైద్యుల పర్యవేక్షణలో సైకలాజికల్‌ ట్రిట్‌మెంట్‌ ఇప్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆమెకు అవసరమైతే స్కానింగ్‌ తీయించాలని తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత వైద్యులతో మంజుల ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. మంజులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories