Khammam: కుడి వైపున గుండె కలిగిన మహిళ

Khammam: కుడి వైపున గుండె కలిగిన మహిళ
x
Highlights

గుండె మనిషికి ఎంతో ముఖ్యమైన శరీర అంతర్గత భాగం. సమస్త ప్రాణకోటి బతకాలంటే వాటికి గుండె ఎంతో అవసరం.

గుండె మనిషికి ఎంతో ముఖ్యమైన శరీర అంతర్గత భాగం. సమస్త ప్రాణకోటి బతకాలంటే వాటికి గుండె ఎంతో అవసరం. గుండె లేనిదే ఏ ప్రాణి జీవించదు. ఇక మనుషుల్లో చూసుకుంటే గుండె ఎవరికైనా సాధారణంగా చేతి ఎడమ వైపు ఉంటుంది. కానీ ఓ మహిళకు మాత్రం గుండె కుడివైపునకు ఉంది. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. గుండె కుడివైపు ఉండడం ఏంటి అనుకుంటున్నారు కదూ. కానీ అది నిజం.

వైరాలోని సంత బజార్‌ లో నివాసముంటున్న బాసాటి ఆనంద్, ఉషలు అన్నోన్య దంపతులు. వీరికి పెళ్లయి ఐదు సంత్సరాలు గుడుస్తుంది. వీరికి అన్నీవున్నప్పటికీ ఒక లోటు వెంటాడుతుంది. పిల్లలు లేకపోవడంతో ఆ దంపతులు మంగళవారం ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి పరీక్షలు చేపించుకోవడానికి వెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెకు అన్ని పరీక్షలు చేసారు.

అందులో భాగంగానే స్కానింగ్‌ తీసారు. ఆ స్కానింగ్ లో వైద్యులకు ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఎడమ వైపున ఉండాల్సిన గుండె కుడి వైపున ఉందని తెలిసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఒక్క సారిగా నిర్ఘాంత పోయారు. కానీ వైద్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మనిషిలో కొన్ని జన్యుపరమైన లోపాలు ఉండడం వలన ఇలా జరుగుతుందని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories