కొత్త మున్సిపల్‌ చట్టం ఏ చెబుతోంది..?

కొత్త మున్సిపల్‌ చట్టం ఏ చెబుతోంది..?
x
Highlights

కొత్త మున్సిపల్‌ చట్టం ఏ చెబుతోంది..? ఆ చట్టం ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందుతాయి..? అమలు సరిగ్గా లేకపోతే.. ఉద్యోగాలు ఊడతాయా..? ప్రభుత్వం...

కొత్త మున్సిపల్‌ చట్టం ఏ చెబుతోంది..? ఆ చట్టం ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందుతాయి..? అమలు సరిగ్గా లేకపోతే.. ఉద్యోగాలు ఊడతాయా..? ప్రభుత్వం చెబుతున్నట్లు పురపాలన.. సరికొత్త దిశగా వెళ్తుందా..? అసలు నూతన మున్సిపల్‌ చట్టంలో ఏముంది..? ప్రజలకు సేవలందించడంలో భాగంగా కొత్త చట్టాలు తీసుకురావడం వాటిని అమలు చేయడం పాలకుల విధి. అయితే ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కానీ ఈ సారి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మున్సిపల్‌ చట్టం.. అవినీతి ఏ మాత్రం ఆస్కారం లేకుండా సేవలు ఉంటాయని మొదటి నుంచి చెప్పుకొస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కూడా ఈ చట్టంపై మొదటి నుంచి ప్రజలకు భరోసా ఇస్తూ వచ్చారు. అందుకే మున్సిపల్ ఎన్నికలు కూడా కొత్త చట్టం ఆమోదం తర్వాతే నిర్వహించాలని పట్టుబట్టారు.

ఈ కొత్త చట్టం ద్వారా కలెక్టర్లకు విశేషమైన అధికారాలు లభించాయి. ఏదైనా కారణం చేత ఏ గ్రామ సర్పంచ్‌నైనా కలెక్టర్‌ తొలగిస్తే దానిపై స్టే విధించే అధికారం మంత్రికి లేదని చట్టం చెబుతోంది. అలాగే ప్రతీ గ్రామం, మున్సిపాల్టీల్లో తప్పనిసరిగా స్మశానవాటికలు ఉండాలి. అంతేకాకుండా ప్రజలంతా కరెంటు, నల్లా బిల్లులు, ఇతర రుణాలు విధిగా చెల్లించాలి. లేకపోతే మున్సిపల్‌ కమిషనర్‌ ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో అన్ని ఇళ్లకు క్యూ ఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త డోర్‌ నెంబర్‌ ప్లేట్లు అమర్చాలి. ఆ కోడ్‌తోనే ఆ ఇంటికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. దీంతో సేవలకు ఎలాంటి ఆటంకం కలగదని నేర నియంత్రణకు కూడా ఉపయోగపడనుంది.

ఈ చట్టం ద్వారా పుర ప్రజలకు చాలా సేవలు, అత్యంత పారదర్శకంగా అందనున్నాయి. ప్రజలకు కావాల్సిన సర్టిఫికేట్లు నిర్ణీత గడువులోగా అందజేస్తారు. ఒకవేళ సర్టిఫికేట్‌ ఇవ్వడంలో ఆలస్యం అయితే సంబంధిత అధికారి ఉద్యోగం ఊడిపోతుంది. అలాగే భవన నిర్మాణాల కోసం తీసుకునే అనుమతి కూడా గడువులోగా మంజూరు చేయాలి. లేకపోతే వచ్చినట్టుగానే భావించి నిర్మాణ పనులు మొదలుపెట్టే అవకాశం కల్పిస్తోంది. లే అవుట్లను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మున్సిపాల్టీయే ఓనర్‌ అవుతుంది కాబట్టి ఆ తర్వాతే అమ్మకాలు, కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఇక మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే వారు తప్పకుండా చట్టాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. చట్టాన్ని పూర్తిగా చదవాలని అంగీకారమైతేనే పోటీ చేయాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అలాగే చట్టాన్ని అమలు చేయకపోతే ఉద్యోగులపై నామమాత్రపు చర్యలతో సరిపెట్టమన్న కేసీఆర్‌ సస్పెండ్‌ లాంటివి కాకుండా ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories