రానున్నమూడు రోజుల్లో గ్రేటర్లో మంచి నీటి ఎద్దడి

రానున్నమూడు రోజుల్లో గ్రేటర్లో మంచి నీటి ఎద్దడి
x
Highlights

గ్రేటర్ హైదరబాద్ ప్రజలు మూడురోజులు నీటి ఎద్దడిని ఎదురుకోబోతున్నరు. వారి దాహార్తి తీర్చడంలో ముఖ్య పాత్ర పొషిస్తున్న గోదావరి నీటి సరఫరా మూడు రోజులపాటు నిలిచిపోనున్నాయి.

గ్రేటర్ హైదరబాద్ ప్రజలు మూడురోజులు నీటి ఎద్దడిని ఎదురుకోబోతున్నరు. వారి దాహార్తి తీర్చడంలో ముఖ్యపాత్ర పొషిస్తున్న గోదావరి నీటి సరఫరా మూడు రోజులపాటు నిలిచిపోనున్నాయి. కేసీఆర్ భారీఎత్తున ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ప్యాకేజీ-13లో భాగంగా ఇరిగేషన్ శాఖ గ్రావిటీ కెనాల్ నిర్మాణం ప్రారంభించారు. ఈ కెనాల్ నిర్మాణానికి గజ్వేల్ మండలం కోడకండ్ల నగరానికి వచ్చే గోదావరి 3000 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్ అడ్డుగా వస్తుందని, దీని వేరే చోటికి మారుస్తునారు. దీనివల్ల ఈనెల 16న ఉదయం ఆరు గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు పట్టనంలో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు

నీటి సరఫరా ఉండని ప్రాంతాలు....

భరత్‌నగర్, సనత్‌నగర్, బోరబండ రిజర్వాయర్ పరిధి, చింతల్, జీడిమెట్ల, షాపూర్‌నగర్, సూరారం, జగద్గీరిగుట్ట, కుత్బుల్లాపూర్, పేట్ బషీరాబాద్, డిఫెన్స్‌కాలనీ, గౌతంనగర్, ప్రశాంత్‌నగర్, చాణక్యపురి, మల్కాజ్‌గిరి, ఫతర్‌బాలాయినగర్, అల్వాల్, న్యూ ఓయూటీ కాలనీ, కైలాసగిరి, హఫీజ్‌పేట, మియాపూర్, మాతృశ్రీనగర్, మయూరినగర్, చందానగర్, ఆర్సీపురం, పటాన్‌చెరు, బోలారం, మయూరినగర్, ఎర్రగడ్డ, బోరబండ, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్‌గూడ, ఎస్‌ఆర్‌నగర్, ఆమీర్‌పేట, బంజారాహిల్స్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట, బాలానగర్, భాగ్యనగర్, నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి, బోల్లారం, ఆమీన్‌పూర్, మల్లంపేట, జవహర్‌నగర్, బాలాజీనగర్, కీసర, దమ్మాయిగూడ, నాగారం, చేర్యాల్, ఆర్‌జికే, అహ్మద్‌గూడ, దేవరాయాంజల్, తూంకుంట, ఎన్‌ఎఫ్‌సీ, పోచారం, సింగాపూర్ టౌన్‌షిప్, మౌలాలీ, లాలాపేట, తార్నాక, సీఆర్‌పీఎఫ్, మెస్, కంటోన్మెంట్ బోర్డు పరిధి, తుర్కపల్లి బయోటెక్ పార్కు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు ప్రకటించారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories