లండన్‌లో వరంగల్ యువకుడు మృతి...

లండన్‌లో వరంగల్ యువకుడు మృతి...
x
Highlights

తెలంగాణలోని వరంగల్ నగరానికి చెందిన ఓ యువకుడు లండన్ లో గుండెపోటుతో మరణించాడు.

తెలంగాణలోని వరంగల్ నగరానికి చెందిన ఓ యువకుడు లండన్ లో గుండెపోటుతో మరణించాడు.ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరుకుందామని కలలు కంటూ విదేశాలకు వెళ్లిన ఆ యువకుడి కళలు తీరకుండానే 26 ఏళ్లకే మృత్యువాత పడ్డాడు. ఈ విషయం తెలియగానే అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

పూర్తివివరాళ్లోకెళితే వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్‌కు చెందిన సతీశ్ గతేడాది ఉన్నత చదువుల కోసం లండన్ కూ వెళ్లాడని తెలిపారు. అతను తన స్నేహితులతో ఉంటూ చదువులను కొనసాగిస్తున్నాడన్నారు. ప్రతి రోజులాగే స్నేహితులతో గడిపి ఆదివారం నిద్రపోయిన అతనికి అర్ధరాత్రివేల ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందన్నారు. అది గమనించిన అతని స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించారని, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారన్నారు.

ఈ సంఘటన గురించి సతీశ్ స్నేహితులు తన తల్లిదండ్రులకు వీడియో కాల్ ద్వారా సమాచారం ఇచ్చారని తెలిపారు. కొడుకు మరణ వార్త వినగానే వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. శనివారం రాత్రే తమ కొడుకుతో మాట్లాడామని, అక్కడ కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామని తెలిపారు. జాగ్రత్తలు చెప్పిన 24 గంటలలోనే ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ఇక పోతే సతీశ్ ఇద్దరు సోదరులు కూడా విదేశాల్లో ఉంటున్నారు. సతీష్ పెద్దన్న రంజిత్ అమెరికాలో ఉన్నారని, తమ్ముడు దేవేందర్ యూకేలోనే ఎంఎస్ చదువుతున్నాడని తెలిపారు. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ ఉన్నందులన్న రవాణా పూర్తిగా స్థంబించి ఉండడంతో తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహకరించాలని మృతుడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories