ఆయనకి పెత్తనం అప్పచెబితే.. చాలామంది వీడిపోతారు: వీహెచ్

ఆయనకి పెత్తనం అప్పచెబితే.. చాలామంది వీడిపోతారు: వీహెచ్
x
Highlights

ప్రస్తుతం తెలంగాణ టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరుపై తీవ్ర విమర్శలు వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటివల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలతోపాటు, సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ఉత్తమ్ తీరే ప్రధాన కారణం అని కొంతమంది కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

ప్రస్తుతం తెలంగాణ టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరుపై తీవ్ర విమర్శలు వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటివల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలతోపాటు, సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ఉత్తమ్ తీరే ప్రధాన కారణం అని కొంతమంది కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. కాగా ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని పార్టీనేతలు, కార్యకర్తలు పట్టుబట్టారు. ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించబోతుందన్న ఊహాగానాలు కొంతకాలంగా ఊపందుకున్నాయి. అయితే తాజాగా కుటంబ సమేతంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడం ఈ ఊహాగానాలకు తీవ్రం అయ్యాయి.

అయితే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ నియమిస్తారన్న ప్రచారం ఆయన అభిమానులకు సంబురపరుస్తున్నా.. కాంగ్రెస్‌లో ఆయనంటే గిట్టనివారికి మాత్రం సెగలు పుట్టిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతు లాంటి నాయకులకు. పీసీసీ అధ్యక్షుడిగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని నియమిస్తారా..? అని వీహెచ్ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఒకవేళ రేవంత్ కి పార్టీ పగ్గాలు అప్పజేబితే కాంగ్రెస్‌ పార్టీని చాలామంది వీడిపోతారని అన్నారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని.. ఆయారాం.. గయరాం.. వంటి వ్యక్తులకు పార్టీలో కీలక పదవులు ఇస్తున్నారని ఆవేదన చేశారు. ఓడిపోయినవాళ్లకు కూడా ఎంపీ టిక్కెట్లు ఇస్తున్నారని, నేతల బ్యాక్‌గ్రౌండ్ చూసి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీహెచ్ పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారన్నది ఆయన మాటల్లోనే తెలిసిపోతోంది. మరి ఈ నేపథ్యంలో అధిష్టానం ఎవరికి బాధ్యతలు అప్పజెప్పుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories