logo

'ఆమె నా బాస్' ఎంపీగా పోటీ విషయంపై ఉపాసన

Highlights

మెగాస్టార్ చిరంజీవి కోడలు, హీరో రాంచరణ్ భార్య ఉపాసన వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి పోటీ...

మెగాస్టార్ చిరంజీవి కోడలు, హీరో రాంచరణ్ భార్య ఉపాసన వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు ఆమె టీఆరెస్ లో చేరుతుందన్న రూమర్ హల్చల్ చేసింది. దాంతో ఈ వార్తలకు ఆమె వివరణ ఇచ్చారు. అందులో వాస్తవం లేదని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న జాబ్ ను తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని ఆమె తెలిపారు. సంగీతా రెడ్డి (విశ్వేశ్వర్ రెడ్డి భార్య) తన బాస్ అని చెప్పారు. చేవెళ్లలో తన విశ్వేశ్వర్ రెడ్డి మంచి పనులు చేస్తున్నారని తెలిపారు. కాగా ప్రస్తుతం చేవెళ్ల ఎంపీగా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి ఉపాసనకు బాబాయ్ అవుతారు. ఉపాసన అమ్మ, విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి స్వయానా అక్కాచెల్లెళ్లు.


లైవ్ టీవి


Share it
Top