ప్రతి పాఠశాలలో 'ఫిట్‌ ఇండియా.. ఫిట్‌ స్కూల్‌'

ప్రతి పాఠశాలలో ఫిట్‌ ఇండియా.. ఫిట్‌ స్కూల్‌
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ప్రస్తుతం ప్రపంచంలో పెరిగిపోతున్న కాలుష్యానికి, ఆహారపు అలవాట్లకు మనిషి జీవిత కాలం రోజు రోజుకు తగ్గిపోతుంది.

ప్రస్తుతం ప్రపంచంలో పెరిగిపోతున్న కాలుష్యానికి, ఆహారపు అలవాట్లకు మనిషి జీవిత కాలం రోజు రోజుకు తగ్గిపోతుంది. కొన్నేండ్ల క్రితం 100 ఏళ్లు ఆరోగ్యంగా బతికే వారు. కానీ ఇప్పుడు జీవన ప్రయాణం 50 నుంచి 60 ఏళ్లకు పడిపోయింది. ఈ కోణంలోనే ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు. దానికి సులువైన మార్గంగా యోగాను ఎంచుకుంటున్నారు. దీంతో ఆరోగ్యం కుదుటపడుతుందని, మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని నిపుణులు చెపుతున్నారు.

ఈ నేపథ‌్యంలోనే ప్రతి పాఠశాలలో వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర యువజన సర్వీసుల శాఖ పాఠశాల యాజమాన్యాలకు ఆదేశాలను జారీ చేసింది. ప్రతి విద్యార్ధికి యోగాలో ప్రవేశం ఉండాలని తెలిపారు. అన్ని పాఠశాలలో కచ్చితంగా ప్రతి రోజు వ్యాయామం చేయాలని, దానికోసం అనుసరించాల్సిన విధివిధానాలను విడుదల చేసింది. యోగా ద్వారా విద్యార్థులు ఎంతో చురుకుగా తయారవుతారని, జ్ఞాపక శక్తి మెరుగు పడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఫిట్‌ ఇండియా ఫిట్‌ స్కూల్‌ విధానం అమలు చేయాలని స్పష్టం చేసింది.

ఫిట్‌ ఇండియా ఫిట్‌ స్కూల్‌ విధానం ద్వారా పాఠశాలల్లో ప్రతి రోజు అమలు చేయాల్సిన కార్యక్రమాలను చూసుకుంటే

సోమవారం రోజున యోగా, వ్యాయామం చేయడంతో పాటు శారీరక దృఢత్వం కోసం అనుసరించాల్సిన విధానాలు పూర్తి స్ధాయిలో విద్యార్థులకు నిపుణులతో చెప్పించడం. మంచి పోషకాహారాన్ని నిత్యం తీసుకోవాలని పోషకాహార నిపుణుల సలహాలు ఇప్పించడం చేయాలి.

అదే విధంగా మంగళవారం ప్రార్థన సమయంలో విద్యార్థఉల్లో కొంతసేపు కచ్చితంగా కాళ్లు, చేతులు ఆడిస్తూ వ్యాయామం చేయించడం. పాఠశాల్లో విద్యార్థులు ఆటలు ఆడడం వలన, క్రీడలతో మానసిక ఆరోగ్యం ఎలా సాధ్యమవుతుందో తెలిపే విధంగా పేరుగాంచిన క్రీడా అధ్యాపకులతో ప్రసంగాలు ఇప్పించడం.

బుధవారం రోజున వ్యాయామ ఉపాధ్యాయులు 'ఖేలో ఇండియా యాప్‌'ను అనుసరిస్తూ అందులో పేర్కొన్న శారీరక దారుఢ్యం పెంపొందించుకునే చిట్కాలను వివరించాలి. వాల్ పోస్టర్లను ఉపయోగించి విద్యార్థులకు యోగా గురించి, ఆటల గురించి వివరించాలి.

గురువారం రోజున విద్యార్థులకు నృత్యం, ఏరోబిక్స్, ఆత్మరక్షణ విద్యలు, యోగాసనాలు, తాడుతో ఎగురుడు ఆటలు, స్కిప్పింగ్, తోట పనులు నేర్పించాలి. వారు ఎంత మేరకు నేర్చుకున్నారన్న విషయాన్ని తెలుసుకోవడానికి క్రీడా పోటీలను నిర్వహించాలి.

శుక్రవారం రోజున ఆటలు, వ్యాయమం పట్ల విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించాలని తెలిపారు. కొత్త రకం వ్యాయామ కార్యక్రమాలపై సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేసి వాటిలో ప్రావీణ్యం పొందేలా చేయాలి.

శనివారం రోజు నిపుణులు సూచించిన వ్యాయామాలు చేయించాలి, ఆటలు ఆడించాలి. కబడ్డీ, బొంగరాలు తిప్పడం, దొంగ పోలీస్‌ ఆట, కుప్పిగంతులాట, వేగంగా నడవడం, పరుగెత్తడం, పుస్తకాలలోని పాఠ్యాంశాలను మనో పఠనంతో వేగంగా చదవడం కంటికి వ్యాయామం కలిగించినట్లవుతుందని, నిపుణులు భావించి వీటిని ఆటవిడుపుగా నిర్వహించాలని పేర్కొంది.

ప్రతి పాఠశాలలో ఈ విధంగా కార్యాచరణను నిర్వహిస్తే ప్రతి విద్యార్థి క్రీడల్లో, చదువులో చురుకుగా పాల్గొంటారని, భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతారని నిపుణులు తెలుపుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories