Munugode: మునుగోడు పరిసరాల్లో వంద చోట్ల తనిఖీ కేంద్రాలు

Munugode: ఒక్కో తనిఖీకేంద్రంలో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు

Jyothi
Published on: 26 Oct 2022 8:11 AM IST
Two Sub Inspectors in Each CheckPost
X

Munugode: మునుగోడు పరిసరాల్లో వంద చోట్ల తనిఖీ కేంద్రాలు

Munugode: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోకి డబ్బు, మద్యం డంప్ కాకుండా సుమారు వంద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తుండడంతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నల్గొండ జిల్లా, రాచకొండ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్కో చెక్ పోస్టు వద్ద ఇద్దరు ఎస్ఐలు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 2 కోట్లకు పైగా నగుదు పట్టుబడినట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story