హైదరాబాద్‌లోని నల్గొండ చౌరస్తాలో రెండు లారీలు ఢీ

* యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీ కొన్న మరో లారీ.. డ్రైవర్‌కు గాయాలు, ఆస్పత్రికి తరలింపు

R Tripura Malini
Published on: 14 Dec 2022 10:09 AM IST
Two Lorries Collided  At Nalgonda Intersection In Hyderabad
X

హైదరాబాద్‌లోని నల్గొండ చౌరస్తాలో రెండు లారీలు ఢీ

Hyderabad: హైదరాబాద్‌లోని నల్గొండ చౌరస్తాలో రెండు లారీలు ఢీ కొట్టుకున్నాయి. యూటర్న్ తీసుకుంటున్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చి మరో లారీ ఢీ కొట్టింది. దీంతో చాదర్ ఘాట్, మలక్‌పేట, దిల్ సుఖ్‌నగర్ వెళ్లే రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రెండు లారీలను క్రేన్‌ల సహాయంతో తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story