ఆసిఫాబాద్‌లో రెండు కరోనా కేసులు..ఆశ్చర్యంలో వైద్యాధికారులు

ఆసిఫాబాద్‌లో రెండు కరోనా కేసులు..ఆశ్చర్యంలో వైద్యాధికారులు
x
Highlights

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. నమోదయిన కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ మర్కజ్ వెళ్లొచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు ఉండడం గమనార్హం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. నమోదయిన కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ మర్కజ్ వెళ్లొచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు ఉండడం గమనార్హం.ఈ నేపథ్యంలోనే కొమురంభీ ఆసిఫాబాద్ జిల్లాలోనూ రెండు కరోనా పాజిటిక్ కేసులు నమోదయ్యాయి.

నిజానికి మర్కజ్‌ వెళ్లొచ్చిన అతనికి పాజిటివ్ రావాల్సి ఉండగా అతనికి నెగిటివ్ వచ్చి వారి కుటుంబ సభ్యులకు పాజిటివ్ వచ్చింది. అసలు ఇది ఎలా సాధ్యం అని అక్కడున్న వైద్యులంతా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ రెండు కేసులు నమోదవ్వడంతో ఆసిఫాబాద్ జిల్లా వాసుల్లో ఒక్క సారిగా భయం మొదలయింది.

పూర్తివివరాళ్లోకెళితే కొమురంభీం ఆసీఫాబాద్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. ఆసిఫాబాద్ జిల్లా జైనుర్‌కు చెందిన వ్యక్తిని ఢిల్లీలోని మర్కజ్ కు వెల్లొచ్చాడు. దీంతో ఆ వ్యక్తిని అధికారులు ఆసిఫాబాద్ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అతను మర్కజ్ వెళ్లొచ్చిన తరువాత తన కుటుంబ సభ్యులతో చనువుగా మెదలడంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా వాంకిడి ఆశ్రమ పాఠశాల క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

అనంతరం అక్కడ వారి శాంపిల్స్ ని తీసుకుని వైద్య పరీక్షల కోసం పంపించారు. కాగా వారి రిపోర్టులు శుక్రవారం వచ్చాయి. ఆ రిపోర్టులను పరిశీలించిన వైద్యులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. మర్కజ్ వెల్లొచ్చిన వ్యక్తికేమో నెగిటివ్ వచ్చి, ఆయన ఇద్దరు కుమారులకు పాజిటివ్‌ రావడంతో ఇదెలా సాధ్యం అన్న అనుమానంతో వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories