పసుపు రైతుల ఆగ్రహం : ఎంపీ దిష్టి బొమ్మ దహనం

పసుపు రైతుల ఆగ్రహం : ఎంపీ దిష్టి బొమ్మ దహనం
x
ఎం పీ అరవింద్ దిష్టిబొమ్మతో రైతులు
Highlights

నిజామాబాద్ జిల్లాలో ఉద్ధ్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో తాను గెలిస్తే జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చారు ఎంపీ అరవింద్. ఆయన...

నిజామాబాద్ జిల్లాలో ఉద్ధ్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో తాను గెలిస్తే జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చారు ఎంపీ అరవింద్. ఆయన గెలిచిన తరువాత తాను మాటను నిలబెట్టుకోలేదని ఆయనపై రైతులు నిప్పులు చెరిగారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ఆయన నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కమ్మర్ పల్లి వేల్పురు మండల కేంద్రంలో ‍ఆయన దిష్టిబొమ్మతో రైతులు శవయాత్ర చేసారు. అనంతరం గ్రామంలోని కూడలిలో దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతేకాకుండా మెండోరా మండలం సావేల్, కోడిచర్ల, మెండోరా గ్రామాల్లో పసుపు రైతుల భారీ ఎత్తున పాదయాత్రను నిర్వహించారు. ఇందులో భాగంగానే రైతుల సంతకాల సేకరణ నిర్వహిస్తామని పసుపు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రకటించింది. ఇప్పటికైనా రైతులు ఎన్నో ఏండ్లనుండి ఎదురు చూస్తున్న పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. వారు పండించిన పంటకు గిట్టుబాట ధరలు కల్పించాలని రైతులు కోరారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories