Top
logo

దేశంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

దేశంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
X
Highlights

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. దళితులకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు.

కేసీఆర్ పై అసెంబ్లీ వేదికగా ప్రసంశల వర‌్షం కురిపించారు ఆపార్టీ ఎమ్మెల్యేలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. దళితులకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషను కల్పించారని, 25మంది దళితులను మార్కెట్ కమిటీ చైర్మన్లుగా నియమించారని ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. జన సంక్షేమానికి భారీగా బడ్జెట్ కేటాయించిన సీఎంకు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కేసీఆర్ వల్లే తండాల్లో ఆరోగ్యమైన జీవితం గడుపుతున్నామని, మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షితమైన మంచినీరు అందిస్తున్నారని ఎమ్మెల్యే రేగాకాంతారావు తెలిపారు. ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీ మాట్లాడుతూ ..., షాదీముబారక్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్‌కు నిధులను కేసీఆర్ మంజూరుచేశారని చెప్పారు. మక్కామసీదుకు నిధులు విడుదలచేసి మరమ్మత్తులు చేయిస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు.

Next Story