నేడు టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం..సభ్యత్వ నమోదు ప్రారంభం

నేడు టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం..సభ్యత్వ నమోదు ప్రారంభం
x
Highlights

తెలంగాణ భవన్‌లో ఈరోజు టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ సభ్యత్వ నమోదు, మున్సిపల్‌ ఎన్నికలే అజెండాగా కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు....

తెలంగాణ భవన్‌లో ఈరోజు టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ సభ్యత్వ నమోదు, మున్సిపల్‌ ఎన్నికలే అజెండాగా కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. కోటి మంది సభ్యులే లక్ష్యంగా ముందుకెళ్తోన్న గులాబీ బాస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కోసం లీడర్లకు టార్గెట్లు ఇవ్వనున్నారు. ఎన్నికల సీజన్ ముగియడంతో పార్టీ సంస్థాగత నిర్మాణంపై గులాబీ బాస్‌ దృష్టిపెట్టారు. తెలంగాణ భవన్‌లో ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో సమావేశంకానున్న కేసీఆర్‌ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.

ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమోదుపై కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. కోటి సభ్యత్వాలే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈరోజు నుంచి జులై చివరినాటికి సభ్యత్వ నమోదు కంప్లీట్‌ చేయాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నారు. దాదాపు నెలరోజులపాటు ఊరారా పెద్దఎత్తున పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టనున్నారు. తెలంగాణ భవన్‌లో ఈరోజు జరగనున్న రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి సభ్యత్వాన్ని కేసీఆర్ తీసుకోనున్నారు. కేసీఆర్‌ తర్వాత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం తెలంగాణ భవన్‌లో 11 కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 70లక్షల క్రియాశీల-సాధారణ సభ‌్యులు ఉండగా, ఈసారి కోటి మందిని సభ్యులుగా చేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రికార్డుస్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి, టీఆర్‌ఎస్‌ బలాన్ని మరోసారి చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తవగానే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు వేయాలని గులాబీ దళపతి భావిస్తున్నారు. అలాగే జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను దసరా రోజున ప్రారంభోత్సవాలు చేసుకునేలా వేగంగా కంప్లీట్‌ చేయాలని ఆదేశించనున్నారు. ఇక మిగిలివున్న మున్సిపల్‌ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేసేలా ఇప్పట్నుంచే సమాయత్తం కావాలని నేతలకు కేసీఆర్‌‌ దిశానిర్దేశం చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories