ఆర్టీసీ వ్యవస్థను గాడిలో పెట్టె చర్యలు ప్రారంభం .. బస్సుల తనిఖీలు.. టికెట్ల జారీకి ప్రయత్నాలు!

ఆర్టీసీ వ్యవస్థను గాడిలో పెట్టె చర్యలు ప్రారంభం .. బస్సుల తనిఖీలు.. టికెట్ల జారీకి ప్రయత్నాలు!
x
Highlights

తెలంగాణా ఆర్టీసీ లో సమ్మె 8 వ రోజుకు చేరుకుంది. ఇటు సమ్మెపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ల విషయాన్ని పక్కన పెట్టేయడమే కాకుండా.. ఆర్టీసీని సమ్మె చేస్తున్న ఉద్యోగులు లేకుండానే గాడిలో పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఈరోజు నుంచి ప్రయివేటు బస్సుల్లో కూడా టికెట్లను జారీ చేసే ప్రక్రియ చేపట్టనున్నారు.

ఆర్టీసీ కార్మికులు వారి హక్కుల కోసం చేస్తున్న సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కొన్నిప్రయివేటు బస్సులను తాత్కాలిక డ్రైవర్లను నియమించి నడిపిస్తుంది. ఇదే అదునుగా చేసుకుని ప్రయివేటు వాహనదారులు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలను వసూలు చేస్తున్నారు. వేరే దారి లేక ప్రయాణికులు వారి గమ్య స్థానానికి చేరుకోవాడానికి వాహనదారులు చెప్పినంత చార్జీలను పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో బస్సుల్లో అధికంగా చార్జీలు వసూలు చేస్తుండడంపై రవాణాశాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు చెందిన రవాణా శాఖ అధికారుల బృందాలుగా విడిపోయి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను విచారించారు. బేగంపేట, కార్ఖానా, అమీర్‌పేట, మియాపూర్‌, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, సుచ్రిత, బొల్లారం, కొంపల్లి ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈరోజు నుంచి ప్రయివేటు బస్సుల్లోనూ టికెట్లు ఇస్తారు..

రంగారెడ్డి జిల్లా పరిధిలో పలు చోట్ల డ్రైవర్లకు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి ఎం.ప్రవీణ్‌రావు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు జారీ చేసిన అన్ని రకాల పాసులు చెల్లుబాటు అవుతున్నాయని, రేపటి నుంచి టికెట్‌ల జారీ కోసం టిమ్‌ యంత్రాలను వినియోగిస్తారని తెలిపారు. ఆర్టీసీకి అవసరమైన మెకానిక్‌లను, కంప్యూటర్‌ ఆపరేటర్లను సైతం అందుబాటులో ఉంచి బస్సులు నిరంతరం నడిచేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బస్సుల్లో టికెట్‌ ధరల పట్టికను సైతం ప్రదర్శించేలా ఏర్పాటు చేశారని, అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్లయితే తమకు ఫిర్యాదు చేయాలని వారు ప్రయాణికులకు తెలిపారు.

ఇదిలా ఉండగా తెలంగాణ బస్సుల్లో తాత్కాలిక కండక్షర్లూ విధిగా టికెట్లు ఇచ్చేలా చూసేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. మొదటిగా పాత విధానంలో ముద్రించిన టికెట్లు ఇచ్చి, తర్వాత టిమ్స్‌ సహాయంతో టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్‌, ప్రైవేట్‌ స్టేజ్‌ కారియర్లకు అనుమతి, కొత్త సిబ్బంది నియామకంపైనా కసరత్తు కొనసాగుతోంది. తాత్కాలిక కండక్లర్లు టికెట్లు ఇవ్వకుండా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారుల దృష్టికి వచ్చింది. ఇందుకు టికెట్లు ఇవ్వకపోవడమే కారణంగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి తాత్కాలిక కండక్టర్లు కూడా విధిగా టికెట్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories