ఇవాళ పీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన ముఖ్యనేతల సమావేశం

Congress Meeting: రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాలపై చర్చ

Jyothi
Published on: 19 Nov 2022 8:48 AM IST
Today Revanth Reddy is a Meeting of the Chief Leaders
X

ఇవాళ పీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన ముఖ్యనేతల సమావేశం

Congress Meeting: ఇవాళ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశంకానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ ద్వారా.. ప్రజల్లోకి వెళ్లేలా యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు. రైతు సమస్యలు, ఓబీసీ సమస్యలు, నోటిఫికేషన్లు, మహిళా సమస్యలపై చర్చించి.. ప్రత్యేక కార్యాచారణపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా వరంగల్‌ రైతు డిక్లరేషన్ విజయం తర్వాత... భారత్ జోడో జోష్‌తో క్షేత్రస్థాయిలో బలం పుంజుకుంటున్న కాంగ్రెస్‌కు.. ఈ సమావేశం ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. అధిష్టానం అనుమతితో రాష్ట్రంలో పాదయాత్రతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story