నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు
x
Telangana Assembly
Highlights

రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయానికొచ్చింది.

రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయానికొచ్చింది. రాష్ట్రంలోని పాఠశాలలు, విద్యాసంస్ధలు, సినిమాహాల్లలు ఈ నెల 31వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే శాసనసభ సమావేశాలను కూడా సోమవారానికి ముగించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా ఈ సమావేశాలు సోమవారం ముగియనున్నారు. ఈ నెల 20వ తేది వరకు కొనసాగాల్సిన సమావేశాలు రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో నాలుగు రోజుల ముందగాను ముగించనున్నారు. ఆదివారం సాయంత్రం స్పీకర్ పోచారం శ్రీనివసరెడ్డి చాంబర్ లో ఇందుకు సంబంధించి శాసనసభ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంఐఎం, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్లు హాజరయ్యారు. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఈ నేపథ్యంలోనే సమావేశాలు కుదిస్తున్నామని ఆయన స్పీకర్ స్పష్టం చేసారు.

ఇక సోమవారం నిర్వహించే చివరి రోజు సమావేశంలో ఎంతో కీలకమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ముందుగా సభలో ఈ చట్టంపై చర్చించి ఆ తరువాత తీర్మాణం చేయనున్నారు. అనంతరం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ వ్యతిరేక తీర్మాణంతో పాటు, ఇతర బిల్లులు, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తెలిపిన తక్షణమే శాసనసభను నిరవధికంగా వాయిదా వేయనున్నారని సమాచారం. ఇక ఈ శాసనసభలో ఉదయం 11 గంటలకు శాసనసభ, మండలి రెండూ వేర్వేరుగా సమావేశమవుతాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories