నేడే వనదేవతల వన ప్రవేశం

నేడే వనదేవతల వన ప్రవేశం
x
Highlights

వనదేవతలక జనజాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే అతి పెద్ద మేడారం జాతర ఇవాళ చివరి ఘట్టానికి చేరుకోనుంది.

వనదేవతలక జనజాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే అతి పెద్ద మేడారం జాతర ఇవాళ చివరి ఘట్టానికి చేరుకోనుంది. గత మూడు రోజులుగా చిన్నా, పెద్దా, ఆడా మగా అన్న తేడాలేకుండా కోటి మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.

ఇక జాతరను మూడు ఘట్టాలుగా చెప్పుకోవచ్చు అందులో భాగంగానే మొదటి ఘట్టంగా మొదటి రోజు సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులు గద్దెలపై కొలువుతీరి భక్తుల పూజలను అందుకున్నారు. ఇక రెండో ఘట్టంగా సమ్మక్క తల్లి రెండో రోజు గద్దెపైకి కొలువుతీరి భక్తులకు దర్శన భాగ్యం అందించి వారు కోరిన కోరికులు తీరుస్తుంది. ఈ నేపథ్యంలోనే భక్తులు అమ్మవార్లకు తీరొక్క మొక్కులు చెల్లించారు. అమ్మవార్లను తమ ఆడపడుచుగా కొలిచి పసుపు, కుంకుమ, చీర సారెలను అందించి అమ్మవారి ఆశీర్వాదాలను అందుకుంటున్నారు. అంతే కాక భక్తుల కోరిన కోరికలు తీరడంతో తమ బరువు ఎత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పించి, మేకపోతులను, కోళ్లను ఎదురుకొని మొక్కులు తీర్చుకున్నారు.

ఇక పోతే మూడ్రోజులపాటూ నిర్విగ్నంగా జరిగిన ఈ జాతరలో చివరి ఘట్టం నేడు జరగనుంది. ఇప్పటి వరకూ పూజలందుకున్న వన దేవతలు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ఈరోజున సాయంత్రం వనప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్నిగిరిజన పూజారులు దగ్గరుండి నిర్వహించనున్నారు. ముందుగా వనదేవతలకు పూజలు చేసి ఆపై సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం దగ్గర్లోని చిలకలగుట్టపైకి తీసుకెళ్లనున్నారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వేచిచూస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని గద్దెల దగ్గర ఉన్న భక్తులు కళ్లారా చూసేందుకు తగిన ఏర్పాట్లను చేసారు. దీన్ని చూడాలనుకునే వారు గద్దెల సమీపంలో ఉంటేనే చూడడానికి వీలు కల్పించారు. ఆలయం దాటిన తర్వాత బయటివారిని లోపలికి రానివ్వరు.

ఇక పోతే అధికారుల అంచనా ప్రకారమే ఈ ఏడాది మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పల్లెల నుంచి పట్టనాల నుంచి తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా, ఇతర రాష్ట్రానుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు మేడారం చేరుకున్నారు. ఇప్పటి వరకూ ఉన్న లెక్కల ప్రకారం ఇప్పటికే 1.20 కోట్ల మంది వన దేవతల్ని దర్శించుకున్నారని తెలుస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇక ప్రతీ జాతరకు వచ్చినట్టుగానే ఈ సారి కూడా సీఎం కేసీఆర్‌ జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతే కాదు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, వారితో పాటు ఎంతో మంది మంత్రులు, ఇతర పార్టీల రాజకీయ నేతలు, ప్రముఖులు జాతరకు తరలివచ్చి వారి వారి మొక్కులను చెల్లించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే సారి జాతరకు ప్రభుత్వం భక్తుల సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులు, రైళ్లను వేసింది. అంతే కాకుండా ప్రత్యేకంగా హెలికాప్టర్ సదుపాయాన్ని కూడా ఈ సారి తెలంగాణ టూరిజం వారు కల్పించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories