పీఆర్సీ ఆలస్యంపై ఉద్యోగుల అసంతృప్తి

పీఆర్సీ ఆలస్యంపై ఉద్యోగుల అసంతృప్తి
x
Highlights

పీఆర్సీ ఆలస్యంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 20 నెలలు గడిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

పీఆర్సీ ఆలస్యంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 20 నెలలు గడిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, కొత్త ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంలో తాము ఎంతో కృషి చేశామన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల పీఆర్సీ విషయంలో తాత్సరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై తమకు నమ్మకం ఉందని.... ఆశించిన స్థాయికంటే ఎక్కువగానే పీఆర్సీతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పీఆర్సీ ప్రకటన వాయిదా పడటంతో మరోసారి ఉద్యోగులకు నిరాశ తప్పలేదు. అందుకు కారణం పీఆర్సీ గడువును ప్రభుత్వం డిసెంబర్ 31వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడమే. ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలవుతుందని ఆశించిన ఉద్యోగులకు... ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో నిరాశ చెందారు. పీఆర్సీ గడువును డిసెంబర్ చివరి నాటికి పొడిగించడంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన చెందుతున్నారు.

సమైఖ్య రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ఉద్యోగులు తమ జీతాలు తగ్గడం నుండి... రెండు పీఆర్సీలు కోల్పోయామని గుర్తు చేస్తున్నారు. తాము రాష్ట్ర ఏర్పాటులో ముందుండి పోరాటం చేశామన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత.. అదనంగా పని చేస్తున్నామంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ఆశించిన స్థాయిలో స్పందించకపోవడం సరికాదంటున్నారు ఉద్యోగులు.

గత ఏడాది నవంబర్‌10న సీఎంవో నుండి 10-12 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పీఆర్సీని ఆదేశించినట్లు ప్రకటించింది. అయినా నివేదిక ప్రభుత్వానికి చేరలేదు. మరోసారి పీఆర్సీ వాయిదా పడటం ఉద్యోగవర్గాన్ని మరింత నిరాశకు గురిచేసింది. తెలంగాణ తొలి పీఆర్సీ 2018 జూలై 1 నుంచి అమలు కావాల్సింది. ఐఆర్ ప్రకటన లేక, పీఆర్సీ విషయంలో ప్రభుత్వం తన విధానం ప్రకటించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆలస్యం అయినంత మాత్రాన ఉద్యోగులు ఆందోళన చెందవద్దని మంత్రులు సూచిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీని ప్రకటిస్తారని మంత్రులు హామీ ఇస్తున్నారు. పరిస్థితిని భేరీజు వేసి సీఎం ఉద్యోగులకు న్యాయం చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీపై ఊగిసలాట కొనసాగుతూ వస్తోంది. తొలి పీఆర్సీ 2018 జూలై 1నుంచి పీఆర్సీ అమలు కావాల్సింది. 2018 ఆగస్టులోనే వేతనాలు పెంచుతామని సీఎం ప్రకటించినా అమలు కాలేదు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories