తెలంగాణ మైనారిటీ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ మైనారిటీ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం విద్యకు ప్రధాన్యతనిస్తూ పేద విద్యార్థులకు కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించేందుకు గాను గురుకులాలలను ఏర్పాటు చేసింది. కాగా ఇప్పుడు...

తెలంగాణ ప్రభుత్వం విద్యకు ప్రధాన్యతనిస్తూ పేద విద్యార్థులకు కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించేందుకు గాను గురుకులాలలను ఏర్పాటు చేసింది. కాగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలలో 71 స్కూళ్లను ఈ విద్యాసంవత్సరం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తోంది. దీంతో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ మీడియెట్ విద్యను గురుకులాల్లో అందించబోతున్నారు. విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్ని అందించబోతోంది. ఇందుకు గాను ఆయా కళాశాలలో 1000 మంది బోధనా సిబ్బందిని నియమించేందుకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు, మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్‌లో జూనియర్ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు ప్రతీ కాలేజీలో కనీసం 15 మంది జూనియర్ లెక్చరర్లను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తోంది. మరిన్ని వివరాల కోసం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్ http://tmreis.telangana.gov.in/ చూడొచ్చు.

మొత్తం జూనియర్ లెక్చరర్ ఖాళీలు- 1,000

దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 1

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 31

దరఖాస్తుల పరిశీలన- 2020 ఏప్రిల్ 1 నుంచి 15

రాతపరీక్ష- 2020 ఏప్రిల్ 19

ఫలితాల విడుదల- 2020 ఏప్రిల్ 30

ఇంటర్వ్యూలు- 2020 మే 5 నుంచి 20

విద్యార్హత..

ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. బీఈడీ లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి.

అనుభవం..

ఏదైనా జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో కనీసం మూడేళ్లు బోధించిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి : 18 నుంచి 44 ఏళ్లు

ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ

వేతనం- రూ.27,000.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories