Warangal: క్రేన్‌ సాయంతో కారు దొంగిలించిన దుండగులు

Warangal: రెచ్చిపోతున్న వాహనాల దొంగలు

Jyothi
Updated on: 16 Dec 2022 5:05 PM IST
Thieves Stole A Car With the Help of a Crane
X

Warangal: క్రేన్‌ సాయంతో కారు దొంగిలించిన దుండగులు

Warangal: దొంగలు చోరీ చేయడానికి కొత్త రూట్ ఎంచుకుంటున్నారు. వరంగల్ నగరంలో కారు దొంగిలించిన స్టైల్ చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. హనుమాన్ జంక్షన్‌లో నివాసం ఉంటున్న జైపాల్ రెడ్డి తన ఇండికా కారును ఇంటి ముందు పార్క్‌ చేశాడు. ఈ నెల 8న రాత్రి కొందరు వ్యక్తులు క్రేన్‌ సాయంతో కారును ఎత్తుకెళ్లారు. ఉదయం కారు లేకపోవడం గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ని పరిశీలించిన పోలీసులు దొంగతనం జరిగిన తీరును గుర్తించారు. కారును ఆటోనగర్‌లో స్ర్కాప్‌ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి దర్యాప్తు తరువాత వివరాలు వెల్లడిస్తామని వరంగల్ ACP గిరికుమార్ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story