రేపటి నుంచి అమలులోకి కొత్త ట్రాఫిక్ రూల్స్‌

రేపటి నుంచి అమలులోకి కొత్త ట్రాఫిక్ రూల్స్‌
x
Highlights

రేపటి నుంచి అమలులోకి రానున్న కొత్త ట్రాఫిక్ రూల్స్‌. ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరి పాటించాల్సిందే మరి లేదంటే ఫైన్ల రూపంలో భారీ మొత్తాలను చెల్లించుకోకతప్పదు. రూల్స్‌ బ్రేక్‌ చేస్తే భారీ మూల్యం చెల్లించుకునేలా కొత్త చట్టం రూపకల్పన చేశారు.

రేపటి నుంచి అమలులోకి రానున్న కొత్త ట్రాఫిక్ రూల్స్‌. ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరి పాటించాల్సిందే మరి లేదంటే ఫైన్ల రూపంలో భారీ మొత్తాలను చెల్లించుకోకతప్పదు. రూల్స్‌ బ్రేక్‌ చేస్తే భారీ మూల్యం చెల్లించుకునేలా కొత్త చట్టం రూపకల్పన చేశారు. ప్రమాదాన్ని నివారించేందుకే ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం చేశారు. కొత్త మోటారు వాహనాల సవరణ చట్టం-2019'లోని 28 నిబంధనలను సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై రూ. 500-10,000 వరకు జరిమానా, ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించనున్నారు. హెల్మెట్ లేకుంటే రూ.1000 ఫైన్‌, సెల్ ఫోన్ డ్రైవింగ్ కు రూ .5 వేలు వసూల్‌, రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తే రూ.5 వేలు జరిమానా, ఫైర్‌ ఇంజన్‌, అంబులెన్స్‌కి దారి ఇవ్వకపోతే రూ 10 వేలు జరిమానా, ఇక అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తే రూ. 2 వేలు వసూల్‌ చేస్తారు. ఇక లైసైన్స్‌ ఇంటివద్దే మర్చిపోతే రూ. 5 వేలు ఫైన్‌ కట్టాల్సిందే. వాహనం ఇన్సూరెన్స్‌ కాపీ లేకుండా పట్టుబడితే రూ. 2 వేలు ఫైన్, ఓవర్‌ స్పీడ్‌తో ప్రయాణిస్తే వెయ్యి నుంచి రూ.2 వేలు, సీట్‌బెల్టు లేకుండా ప్రయాణిస్తే వెయ్యి, హెల్మెట్ లేకపోతే వెయ్యి, పరిమితికి మించి లోడ్‌తో వెళ్తే రూ.20 వేలు ఫైన్ , డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేలు ఫైన్, చలానాలు కట్టకపోతే జైలుకు వెళ్లాల్సిందేనంటోన్నపోలీసులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories