Top
logo

తెలంగాణలో బీజేపీకి చోటు లేదు: సీఎం కేసీఆర్

తెలంగాణలో బీజేపీకి చోటు లేదు: సీఎం కేసీఆర్
X
Highlights

తెలంగాణలో బీజేపీకి చోటు లేదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో...

తెలంగాణలో బీజేపీకి చోటు లేదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలే పార్టీ శ్రీరామ రక్షా అని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం , సభ్యత్వ నమోదు, మున్సిపల్ ఎన్నికల పై విస్తృతంగా చర్చించారు.

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులతో పాట.. ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ ఇంచార్జీలు హాజరయ్యారు. ప్రధానంగా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణంపై చర్చించారు. జూన్ 24న 29 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భూమి పూజ నిర్వహించారు. ఈ నేపధ్యంలో దసరా లోపు భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రణాళిక రచించారు. ఈ రోజు సమావేశంలో పార్టీ కార్యాలయాల నమూనాలతో పాటు, ఓక్కో కార్యాలయానికి 60 లక్షల చొప్పున పార్టీ నిధులను జిల్లా ఇంచార్జీ నేతలకు గులాభి బాస్ అందించారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతోంది. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అనుకున్న గడువులోపు పార్టీ సభ్యత్వ టార్గెట్ ను రీచ్ అయ్యోలా సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలో పోడు భూముల అంశం హాట్ టాపిగ్గా మారింది. సమావేశంలో కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు సీఎం కేసీఆర్ దృష్టికి పోడు భూములు అంశం తీసుకువచ్చారు. పోడు భూములు సమస్యకు సీఎం శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చినట్టు వనమా తెలిపారు.

బీజేపీ రాష్ట్రంలో దూకుడు పెంచిన నేపధ్యంలో మున్సిపల్ ఎన్నికలను నేతలెవరూ ఆషామాషీగా తీసుకోవద్దని గులాబీ బాస్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. అసలు బీజేపీకి తెలంగాణలో స్థానమే లేదని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శ్రీరామ రక్షగా నిలుస్తాయని సమావేశంలో పార్టీ నేతలకు తెలిపారు.

Next Story