ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగిసిన నిందితుల కస్టడీ..!

the police recorded the statement of the accused
x

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

Highlights

* ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలింపు

Moinabad Farmhouse Case: ఎమ్మెల్యేల కొనుగోలు, ఫామ్ హౌస్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. సిట్ బృందం, మొయినాబాద్ పోలీసులు, రెండు రోజులపాటు విచారణ చేసి నిందితుల స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు వేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్ట్‌లో సుదీర్ఘంగా వాదనలు సాగాయి. బెయిల్ పిటిషన్ పై 14వ తేదీన నాంపల్లి ఏసీబీ కోర్ట్ తీర్పు వెలువరించునుంది. మరో సారి పది రోజుల పాటు నిందితుల కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను కోర్టు తిరస్కరించి, నిందితులకు పద్నాలుగు రోజులపాటు జ్యూడిషియల్ రిమాండ్‌ను పొడిగించింది. పోలీసులు భారీ బందోబస్తు మధ్య నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా నడిచిన ఎమ్మెల్యేల ఎర కేసులో నంద కుమార్, రామచంద్ర భారతీ, సింహయాజిలను మొయినాబాద్ పోలీసులు, అలాగే సిట్ బృందం రెండు రోజుల పాటు కస్టడీ కి ఎమ్మెల్యేలకు ఎర కేసులో నందకుమార్, రామచంద్రభారతీ, సింహయాజిలను సిట్ పలు కోణాల్లో విచారణ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక ఎవరున్నారు. ఢిల్లీ పెద్దల ప్రమేయం, ఆడియో వీడియోలపై ముగ్గురిని కలిపి, అలాగే విడివిడిగా విచారణ చేశారు.

పోలీసులు అడిగిన ప్రశ్నలకు తమకు అసలు ఏమి తెలియదనే సమాధానం తప్ప నిందితులు నోరు విప్పలేదని సమాచారం. నిందితుల ఫోన్ సంభాషణలు కీలకం కావడంతో ఆడియోల పై పోలీసులు దృష్టి పెట్టారు. కోడ్ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడిన ఆడియోలపై కూడా పలు కోణాల్లో విచారణ చేశారు. ఆడియోలో ఉన్న వాయిస్ పై ఎఫెసేల్ కార్యాలయానికి తరలించి వీరి స్వర నమూనాలు సైతం తీసుకున్నారు. ఫోరెనిక్స్ రిపోర్ట్ వచ్చిన తరువాత వాటిని న్యాయస్థానం ముందు పోలీసులు ఉంచునున్నారు.

నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ పై పిటిషనర్ తరపు న్యాయవాది సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఈ కేసు ఏసీబీ కోర్ట్ పరిధిలోకి రాదని, ఫిర్యాదు దారుడు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేయడానికి అర్హత లేదని పిటిషనర్ కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీఫాంతో గెలిచి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. రెండు రోజులు కస్టడీ ముగియడంతో ఏసీబీ న్యాయస్థానం ముందు నిందితులను పోలీసులు హాజరు పరిచారు.

పోలీసుల కస్టడీలో పోలీసులు తనతో దురుసుగా ప్రవరించారని నందకుమార్ ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు రెండు రోజుల కస్టడీ సరిపోలేదని మరో పదిరోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే పోలీసులు వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. నిందితులకు ఈనెల 25 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించటంతో ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories