Munugode: హోరాహోరీగా సాగుతున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ క్యాంపెయిన్‌

Munugode: చివరి అంకానికి చేరిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం

Jyothi
Updated on: 26 Oct 2022 1:25 PM IST
The Campaign of TRS, BJP and Congress in Munugode
X

Munugode: హోరాహోరీగా సాగుతున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ క్యాంపెయిన్‌

Munugode: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ క్యాంపెయిన్‌ హోరాహోరీగా సాగుతోంది. నమూనా బ్యాలెట్‌లతో ఇంటింటికీ ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోవైపు.. కీలకమైన సామాజిక వర్గాలపై పార్టీలు నజర్‌ పెట్టాయి. హైదరాబాద్‌లో మునుగోడుకు చెందిన ఓటర్లతో వరుస ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో సుమారు 40వేల మంది ఓటర్లు ఉండగా.. ఆ ఓట్లన్నీ తమకే పడేలా పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇక.. 739 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్కో ఓటుకు 3 వేల నుంచి 5వేలు పంచుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో.. మునుగోడు బైపోల్.. రోజు రోజుకు మరింత కాస్ట్లీగా మారుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story