మున్సిపల్‌ వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు

మున్సిపల్‌ వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు
x
రాష్ట్ర పురపాలక సంచాలకులు శ్రీదేవి
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల రంగం సిద్ధం అయింది. రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను రాష్ట్ర పురపాలక సంచాలకులు శ్రీదేవి ఆదివారం ప్రకటించారు....

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల రంగం సిద్ధం అయింది. రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను రాష్ట్ర పురపాలక సంచాలకులు శ్రీదేవి ఆదివారం ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 13 నగరపాలక, 123 పురపాలక, స్థానాలకు కార్పోరేషన్ల మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు అధికారికంగా వెల్లడి చేసారు.

పూర్తివిరాల్లోకెళితే 123 పురపాలికల చైర్మన్లలో ఎస్టీ-4, ఎస్సీ-17, బీసీ-40, జనరల్‌ -62 స్థానాలను కేటాయించగా, 13 నగరపాలక సంస్థల్లో ఎస్టీ-1, ఎస్సీ-1, బీసీ-4, జనరల్‌-7 స్థానాలను కేటాయించామని ఆమె తెలిపారు. 128 మున్సిపాలిటీలో జడ్చర్ల, నకిరేకల్ ఇంకా సమయం ఉందని, వివిధ కారణాలతో పాల్వంచ, మందమర్రి, మణుగూరుకు రిజర్వేషన్ ప్రకటించడం లేదని వివరించారు. ఇకపోతే రామగుండం మేయర్‌ పదవి ఎస్సీకి కేటాయించగా, మీర్‌పేట్‌ మేయర్‌ పదవి ఎస్టీకి కేటాయించారు. వాటితో పాటుగానే జవహర్‌నగర్‌, బండ్లగూడ, నిజామాబాద్‌ నగరపాలక సంస్థ మేయర్‌ పదవులను బీసీకి కేటాయించినట్లు స్పష్టంచేసారు. నూతనంగా ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లే తరువాత ఎన్నికల్లో కూడా వర్తిస్తాయని తెలిపారు. 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించామని ఆమె అన్నారు.

ఎస్సీ రిజర్వుడు మున్సిపాలిటీలు..

నస్కురు, అలంపూర్, తోర్రుర్, నార్సింగి, పెద్ద అంబర్ పేట, ఐజా, కేతనపల్లి, బెల్లంపల్లి, మధిర, పరకాల, వైరా, పెబ్బేరు, నెరుడుచెర్ల, వడ్డేపల్లి, భూపాలపల్లి, తిరుమలగిరి

బీసీ రిజర్వుడు మున్సిపాలిటీలు..

గద్వాల్, ఎల్లారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, సిరిసిల్ల, భీంగల్, ఆందోల్, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, నారాయణ పేట, కోరుట్ల, చండూరు, నిర్మల్, కిసిగి, రాయికల్, పోచంపల్లి, రమాయపేట, బోధన్, సదాశివ పేట, ఆర్ముర్, మెటపల్లి, సుల్తానాబాద్, నర్సంపేట, కిదంగల్, తుఫ్రాన్, ఆలేరు, భువనగిరి.

ఎస్టీ రిజర్వుడ్ మున్సిపాలిటీలు..

అమన్గల్, వర్ధన్నపేట, దోర్నాల్, మరిపెడ, డోర్నకల్.

మొత్తం జనాభాతో పోల్చుకుంటే

1.9 శాతం ఎస్టీ జనాభా 3.25% రిజర్వేషన్లు

3.6 శాతం ఎస్సీ జనాభా 14% రిజర్వేషన్లు

32.5 శాతం బీసీ % జనాభా, 33 శాతం రిజర్వేషన్లు ఖరారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories