రెండు రోజుల్లో ఆ డబ్బులు విడుదల చేస్తాం

రెండు రోజుల్లో ఆ డబ్బులు విడుదల చేస్తాం
x
Harish Rao
Highlights

రుణమాఫీ డబ్బులను రెండు రోజుల్లో విడుదల చేసి రైతుల రుణాలను ఖచ్చితంగా మాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

రుణమాఫీ డబ్బులను రెండు రోజుల్లో విడుదల చేసి రైతుల రుణాలను ఖచ్చితంగా మాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు అన్నారు. నిజాంపేట్ మండలం నార్లాపూర్ లో కొండపోచమ్మ సాగర్ కాలువ నిర్మాణ పనులను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.1198‌ కోట్లను 5 లక్షల 80 వేల‌మంది రైతులకు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నామన్నారు. మొదటి దఫాలో రూ. 25 వేలలోపు రుణాలున్న ప్రతి ఒక్క రైతు రుణాన్ని మాఫీ చేస్తామని తెలిపారు. మరో నాలుగు దఫాలలో లక్ష రూపాయలు రుణం ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు.

అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరను అందిస్తుందన్నారు. స్వయంగా ప్రభుత్వమే రూ.1,835 పెట్టి క్వింటాలు వడ్లను కొనుగోలు చేస్తుందని తెలిపారు. కానీ ఇరుగు పొరుగు రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీలు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలో క్వింటాల్ వరికి రూ.1,300, కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ కు రూ.1200 ఇచ్చి కొనుగోలు చేస్తోందని విమర్శించారు.

ఇక ప్రస్తుతం మెదక్ జిల్లాలో కొత్తగా కరోనా కేసులేవీ నమోదు కావడం లేదని, ఈ జిల్లా కూడా కొన్నిరోజుల్లోనే గ్రీన్‌‌జోన్‌లోకి మారనుందని తెలిపారు. కరోనా వైరస్ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని సూచించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories